30, అక్టోబర్ 2020, శుక్రవారం
Sarath POURNAMA
*శరత్ పూర్ణిమ - విశిష్టత:*
ఈ రోజు (30.10.20)శరత్ పూర్ణిమ.
ఆశ్వీయుజ పూర్ణిమకే శరత్ పూర్ణిమ అని పేరు. ఇది అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు. మామూలు ప్రజలు అమ్మవారి ఆరాధన దేవి నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవీ ఉపాసకులు అమ్మవారి ఆరాధన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు.
ఏడాదిలో ఈ పూర్ణిమ నాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువలన ఈ రోజు చంద్రుడిని పూజించాలి.
ఈ శరత్ పూర్ణిమ రోజున చందకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. అవి శారీరిక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి.
అందువలన చంద్రకాంతిలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేయడం, ఆవుపాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి, ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు.
చంద్రకాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెప్తోంది. చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్రకిరణాల లో ఉన్న ఓషిధీతత్త్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. మరునాడు ఉదయం ఆ పరమాన్నాన్ని కుటుంబసభ్యులందరూ నైవేద్యంగా స్వీకరించాలి.
శ్రీ కృష్ణుడు పరిపూర్ణావతారం. ఆయనలో 16 కళలున్నాయి. అందుకే ఈ శరత్ పూర్ణిమను బృందావనంలో రాసపూర్ణిమ అంటారు. శ్రీ కృష్ణుడు ఈ రోజే మహారాసలీల సలిపాడని అంటారు. కృష్ణుడి వేణుగానం విన్న గోపికలు, అన్నీ వదిలేసి ఆయన కోసం అడవిలోకి పరిగెత్తగా, కొన్ని వేలమంది కృష్ణులు వేలమంది గోపికలతో ఈ పున్నమి రాత్రి మొత్తం నాట్యం చేసారట.
ఈ పూర్ణిమకే కోజాగరి పూర్ణిమ అనే పేరు కూడా ఉంది. కోజాగరీ పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు.
అందరికి శరత్ పూర్ణిమ శుభాకాంక్షలు🌹🙏🌹
Acharya sadbhodana
*ఆచార్య సద్భోదన*
అణకువ, ప్రేమ, సహనం ఇవి అన్ని వేళలా ఉండేలా చూసుకోవాలి.
"నిందాస్తుతుల యందు సమముగా వ్యవహరించువాడు, ఉన్న దానితో సంతృప్తిని పొందువాడు, గృహాదుల (భౌతికత) యందు ఆసక్తి లేని వాడును, నిశ్చయ బుద్ధిని కలిగిన వాడు నాకు ఇష్టుడు. శ్రద్ధావంతులై నాచే చెప్పబడిన మోక్ష సాధనను ఎవరైతే భక్తితో అనుష్ఠిస్తారో అట్టి భక్తుడు నాకు అత్యంత ప్రియమైనవాడు."
-భగవద్గీత.
మన హృదయంలో వినమ్రత నిండి ఉంటే ఇంకొకరిని తూలనాడము. ప్రేమను సదా వ్యక్త పరుస్తూ ఉన్నప్పుడే సహనశక్తి పెరుగుతుంది. ఈ మూడూ సమతుల్యంగా ఉన్నప్పుడే సామరస్యం చేకూరుతుంది. వీటిని అభివృద్ధి చేసుకొనేందుకు నిరంతర కృషిని అవిరామంగా చేయాలి. మనస్సుని ఈ విధంగా చక్కబెట్టుకుంటే, సహజ జ్ఞానముతో చక్కటి లయ దానంతటదే పలుకుతూ మనలను కష్టాలను అధిగమించే స్థితికి, ఆటంకాలను ఎదుర్కొనే స్థితికి తీసుకువెళుతుంది.
*శుభంభూయాత్*
Praxis Ha Puja
నేటి ప్రదోష పూజ
ప్రదోష స్తోత్రమ్
జయ దేవ జగన్నాథ జయ శఙ్కర శాశ్వత |
జయ సర్వసురాధ్యక్ష జయ సర్వసురార్చిత ||౧||
జయ సర్వగుణాతీత జయ సర్వవరప్రద ||
జయ నిత్య నిరాధార జయ విశ్వమ్భరావ్యయ ||౨||
జయ విశ్వైకవన్ద్యేశ జయ నాగేన్ద్రభూషణ |
జయ గౌరీపతే శమ్భో జయ చన్ద్రార్ధశేఖర ||౩||
జయ కోఠ్యర్కసఙ్కాశ జయానన్తగుణాశ్రయ |
జయ భద్ర విరూపాక్ష జయాచిన్త్య నిరఞ్జన ||౪||
జయ నాథ కృపాసిన్ధో జయ భక్తార్తిభఞ్జన |
జయ దుస్తరసంసారసాగరోత్తారణ ప్రభో ||౫||
ప్రసీద మే మహాదేవ సంసారార్తస్య ఖిద్యతః |
సర్వపాపక్షయం కృత్వా రక్ష మాం పరమేశ్వర ||౬||
మహాదారిద్ర్యమగ్నస్య మహాపాపహతస్య చ ||
మహాశోకనివిష్టస్య మహారోగాతురస్య చ ||౭||
ఋణభారపరీతస్య దహ్యమానస్య కర్మభిః ||
గ్రహైఃప్రపీడ్యమానస్య ప్రసీద మమ శఙ్కర ||౮||
దరిద్రః ప్రార్థయేద్దేవం ప్రదోషే గిరిజాపతిమ్ ||
అర్థాఢ్యో వాఽథ రాజా వా ప్రార్థయేద్దేవమీశ్వరమ్ ||౯||
దీర్ఘమాయుః సదారోగ్యం కోశవృద్ధిర్బలోన్నతిః ||
మమాస్తు నిత్యమానన్దః ప్రసాదాత్తవ శఙ్కర ||౧౦||
శత్రవః సంక్షయం యాన్తు ప్రసీదన్తు మమ ప్రజాః ||
నశ్యన్తు దస్యవో రాష్ట్రే జనాః సన్తు నిరాపదః ||౧౧||
దుర్భిక్షమారిసన్తాపాః శమం యాన్తు మహీతలే ||
సర్వసస్యసమృద్ధిశ్చ భూయాత్సుఖమయా దిశః ||౧౨||
ఏవమారాధయేద్దేవం పూజాన్తే గిరిజాపతిమ్ ||
బ్రాహ్మణాన్భోజయేత్ పశ్చాద్దక్షిణాభిశ్చ పూజయేత్ ||౧౩||
సర్వపాపక్షయకరీ సర్వరోగనివారణీ |
శివపూజా మయాఽఽఖ్యాతా సర్వాభీష్టఫలప్రదా ||౧౪||
ఇతి ప్రదోషస్తోత్రం సమ్పూర్ణమ్ ||
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
18, జూన్ 2020, గురువారం
బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు బ్రహ్మ జ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సు నాచరించారు. అయినా వారికి అంతుపట్టలేదు. వారు చివరికి పరమ శివుని దగ్గరకు వెళ్ళి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు. అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు. ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది. ఈ రూపాన్నే దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది.ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే జ్ఞానమనేది మాటల్లో వర్ణించలేనిది, కేవలం అనుభవించదగినది అని. గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు. అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు.
స్మార్త సంప్రదాయంలో గురు సంప్రదాయానికి ఆద్యుడు దక్షిణామూర్తి. ఉత్తర భాగాన (అనగా ఎడమభాగాన) అమ్మవారి స్వరూపం లేని కేవల శివ స్వరూపం కనుక దానికి ‘దక్షిణామూర్తి’ అని పేరు. మేధా దక్షిణామూర్తి వేరే దేవత కాదు. ఆ స్వామిని ప్రతిపాదించ మంత్రాలలో ఒక మంత్రానికి అధి దేవతామూర్తి మాత్రమే. అలాగే శ్రీ దత్తాత్రేయుడు, గురుదత్తుడు అనేవారు వేరేవేరే దేవతామూర్తులు కాదు. ఈ దత్తుడు త్రిమూర్త్యాత్మకుడు. సర్వసంప్రదాయ సమన్వయకర్త. ఇక దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు వీరిద్దరూ ఒకరేనా అంటే, తత్త్వ దృష్టిలో ఖాయంగా ఒకరే. వ్యావహారిక దృష్టిలో, ఉపాసనా విధానంలో మాత్రం భిన్నులు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఒకరా? వేరా? అంటే, ఏమి చెబుతామో, ఇక్కడా అలాగే చెప్పుకోవాలి. ఒక దృష్టితో భిన్నత్వం! మరో దృష్టితో ఏకత్వం!!
శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం. దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోయాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి.
మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి. ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి. దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు.
మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది.
ఆ రూపాలు వరుసగా….
శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి¸హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తి¸ కీర్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి¸ శక్తి దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి.
ప్రధానమైన ఈ 16 మూర్తులలో వట మూల నివాస దక్షిణామూర్తినే వీణా దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతోంది. భస్మాన్ని అలముకున్న తెల్లనివాడు, చంద్రకళాధరుడు, జ్ఞానముద్ర, అక్షమాల, వీణ, పుస్తకాలను ధరించి యోగముద్రుడై స్థిరుడైనవాడు, సర్పాలను దాల్చిన కృత్తివాసుడు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి. తెలివిని, విద్యను మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు.
పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు. సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు.
చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షముకి అదిష్టానం అయి ఉంటాడు.